ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ

1చూసినవారు
ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ
తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీలలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం 5% రాయితీ ప్రకటించింది. కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, మే 1 నుంచి మే 31 వరకు పన్ను చెల్లించేవారు ఈ రాయితీని పొందవచ్చు. జిల్లాలో మొత్తం ఆస్తి పన్ను డిమాండ్ రూ. 129.55 కోట్లు కాగా, 4,21,264 అసెస్మెంట్లు ఉన్నాయి. ఇప్పటికే 3,427 మంది ఆస్తి యజమానులు ముందస్తు పన్ను చెల్లించి 5% ఎర్లీ బర్డ్ రాయితీని పొందారు.

సంబంధిత పోస్ట్