రాజధానిలో కాపు జాతికి 500 ఎకరాలు కేటాయించాలి

3చూసినవారు
రాజమండ్రిలో మార్చి 8వ తేదీన రాష్ట్ర కాపు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు కాపు రిజర్వేషన్ సాధనా సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డి మల్లిఖార్జున్ తెలిపారు. రాజధానిలో కాపు జాతికి ప్రభుత్వం 500 ఎకరాలు కేటాయించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. రాజధానిలో అత్యధికంగా కమ్మవారు భూములు కొనుగోలు చేసిన తర్వాతే అమరావతిని రాజధానిగా ప్రకటించారని ఆయన విమర్శించారు.