ఈ నెల 16న రాజమండ్రిలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభ

3చూసినవారు
ఈ నెల 16న రాజమండ్రిలో జరగనున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు తరలిరావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, AITUC జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధులు పిలుపునిచ్చారు. సోమవారం రాజమండ్రిలో మహాసభల కరపత్రాలను విడుదల చేసిన సందర్భంగా వారు ఈ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఈ మహాసభల్లో ప్రధానంగా డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్