జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

5చూసినవారు
జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
తూర్పు గోదావరి జిల్లాలో 5-18 ఏళ్లలోపు అసాధారణ ప్రతిభ కనబరిచిన బాలల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత అధికారిణి టి. శ్రీదేవి బుధవారం తెలిపారు. సాహసం, సామాజిక సేవ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో విశిష్ట విజయాలు సాధించిన భారతీయ బాలలు జూలై 31 లోపు awards.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్