ఆదివారం రాజమండ్రిలోని
వైసీపీ కార్యాలయంలో ఆటో కార్మికులతో మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటో కార్మికులకు
వైసీపీ అధినేత, మాజీ సీఎం
జగన్ అండగా ఉన్నారని, వారంతా
వైసీపీ సంస్థాగత పటిష్టతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వైసిపి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.