
ఇన్‌స్టా ప్రేమ.. 14 ఏళ్ల మైనర్ బాలుడితో 40 ఏళ్ల మహిళ ప్రేమాయణం
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. 40 ఏళ్ల మహిళకు 14 ఏళ్ల బాలుడికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడి, అది పెళ్లికి దారితీసింది. అయితే బాలుడు తనతో ఉండటానికి నిరాకరిస్తున్నాడని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వయసు వ్యత్యాసం, బాలుడు మైనర్ కావడం ఈ కేసు కలకలం రేపింది. పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయకుండా, పెద్దల సమక్షంలో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. దీంతో మహిళ కేసు పెట్టడానికి నిరాకరించడంతో వివాదం ముగిసింది.




