శుక్రవారం రాజమండ్రిలో బిజెపి సీనియర్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బిజెపి నేతలు ధార్మిక సెల్ కన్వీనర్ డా.చాగంటి నరసింహా రావు, టీచర్స్ సెల్ కన్వీనర్ పి.బాజ్జీ, రామకృష్ణను పరామర్శించి, ప్రమాద పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీలో చురుకుగా వ్యవహరించే రామకృష్ణ సేవలను కొనియాడి, నేతలు ధైర్యం చెప్పారు.