కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు నూతన లేబర్ కోడ్‌లను నిరసిస్తూ రాజమండ్రిలో కార్మిక సంఘాలు బుధవారం 'బ్లాక్ డే' నిర్వహించాయి. ఈ నిరసనలో భాగంగా కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి, లేబర్ కోడ్‌లు కార్మిక హక్కులను కాలరాసి, యజమానులకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపిస్తూ వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.