తూర్పు గోదావరి జిల్లాలో ఇంకా 23,871 మంది రైస్ కార్డులకు సంబంధించిన యూనిట్లు/సభ్యుల ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉందని, వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఏఎస్ఓలు, సీఎస్ డీటీలు తమ పరిధిలోని వీఆర్వోలు, ఎఫ్‌పీఎస్ డీలర్లకు ఈ-కేవైసీని ePOS యంత్రాలు లేదా GSWS మొబైల్ యాప్ ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.