డిసెంబర్ 1వ తేదీన శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంలో వృద్ధులు, వితంతువులు, అనాథలకు ఖండవల్లి లక్ష్మి చీరలు, వస్త్రాలు పంపిణీ చేశారు. క్రిస్మస్ అంటేనే ఎదుటివారికి కానుకలు ఇవ్వడమని, అందుకే ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ఖండవల్లి లక్ష్మి తెలిపారు. ఈ వస్త్రదానం రాజమండ్రి సిటీలో జరిగింది.