క్రిస్మస్ అంటేనే ఎదుటివారికి కానుకలు ఇవ్వడం. అందుకే ఏటా డిసెంబర్ 1వ తేదీన జీవకారుణ్య సంఘం వృద్ధులకు, వితంతువులకు, అనాథలకు వస్త్రదానం చేస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ఖండవల్లి లక్ష్మి తెలిపారు. క్రిస్మస్ నెల ప్రారంభం సందర్భంగా శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు, వితంతువులు, అనాథలకు సోమవారం ఖండవల్లి లక్ష్మి చీరలు, వస్త్రాలు పంపిణీ చేశారు.