10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు పాఠశాలల్లో ప్రత్యేక అకాడమిక్ ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ఉపాధ్యాయులు A–B గ్రేడ్‌ల్లో ఉన్నవారికి ప్రోత్సాహం, C–D గ్రేడ్‌ల్లో ఉన్నవారికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా 10వ తరగతిలో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు.