2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణపై కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. గత 2015 పుష్కరాల అనుభవాలను పరిశీలిస్తూ, అప్పటి లోపాలు, సమస్యలను గుర్తించి ఈసారి వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భక్తుల రద్దీ నిర్వహణ, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, వసతి వంటి అంశాలపై శాఖల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.