రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ద్వారా లబ్ధిదారులకు పోషకాహార భద్రతను బలోపేతం చేయడం, ఆహార వైవిధ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రతి రైస్ కార్డుకు 1 కేజీ గోధుమపిండి ప్యాకెట్‌ను కేవలం రూ. 20కే పంపిణీ చేయనున్నట్లు జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలో నిర్వహించిన గోధుమపిండి పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.