మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎంకి నివేదికలు సమర్పించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ముఖ్యమంత్రి తమ పనితీరుపై అభినందనలు తెలపడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.