రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో కుక్కల బెడద తీవ్రమైంది. మెయిన్ ఎంట్రన్స్, ఒకటి, రెండు నంబర్ ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లే మెట్లపై కూడా కుక్కలు తిరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.