రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిటివో ఎన్. సత్యనారాయణ విజ్ఞప్తి

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఫిబ్రవరి 28 లోగా తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలని డీటీఓ ఎన్. సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గురువారం RJY జిల్లా ఖజానా కార్యాలయంలో ఈ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. గడువులోగా ధ్రువీకరణ పత్రాలు అందజేయని పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
