రాజమండ్రిలోని 7వ డివిజన్లో రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం నగరంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.