రాజమండ్రి సిటీలో ప్రతిష్టాత్మక హితకారిణి సమాజం ట్రస్టు చైర్మన్‌గా డాక్టర్ యాళ్ళ ప్రదీప్ సుకుమార్, శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా కొయ్యల రమణ నియమితులయ్యారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం ప్రకటించారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, చైర్మన్లతో పాటు కూటమిలోని 11 మంది వంతున సభ్యులను నియమించామని తెలిపారు. రాజమండ్రిలోని 14 ఎండోమెంట్ కమిటీలు ఉండగా, ఇంతవరకు 12 కమిటీలు వేశామని ఆయన చెప్పారు.