డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు భేటీ

8చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు భేటీ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంగళవారం రాత్రి రాజమండ్రిలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సంబంధిత అంశాలపై ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో వై. రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, కిలారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్ వంటి ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై నిర్మాతలు తమ అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్