రాజమండ్రిలోని 30వ డివిజన్‌లో సోమవారం
ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, స్థానిక నాయకులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా పెన్షన్లు అందించి జీవనోపాధికి అండగా నిలుస్తోందని కమిషనర్ తెలిపారు.
ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని పేర్కొన్నారు.