జిల్లా పోలీస్ కార్యాలయంలో మాజీ సీఎం జయంతి వేడుకలు

11చూసినవారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో మాజీ సీఎం జయంతి వేడుకలు
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు, రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎల్. చెంచిరెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని, ఆయన సినీ రంగంలో అపూర్వ విజయాలు సాధించి, అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవకు అంకితమయ్యారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్