మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ బుధవారం రాజమండ్రిలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి తిరుపతి కల్తీ లడ్డూ, బంధువులకు భూముల పంపిణీ తప్ప వేరే ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లల మెస్ చార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బాకీలు చెల్లించాలనే ధ్యాస ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. కాకినాడలో ఇసుక అక్రమ తవ్వకాలను ఆయన ఆరోపించారు.