తూర్పు గోదావరి జిల్లాలో ప్రాథమిక రంగ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను గుర్తించి, వారికి అవగాహన, ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు & ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, పర్యాటకం, డి. ఆర్. డి. ఏ., మెప్మా శాఖల అధికారులు ఔత్సాహికులను చైతన్యవంతులను చేసి, బ్యాంకు రుణాల కోసం బ్యాంకులతో సమన్వయం చేయాలని సూచించారు.