ఆదివారం రాజమండ్రిలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’, ‘నా ఘాట్ – నా బాధ్యత’ సంయుక్త కార్యాచరణలో భాగంగా కమిషనర్ రాహుల్ మీనా ‘గ్రీన్ వాక్’ను ప్రారంభించారు. పుష్కర ఘాట్ నుంచి రివర్ ఫ్రంట్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ‘ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం - గోదావరిని కాపాడుకుందాం’ నినాదాలు చేశారు. గోదావరి నదిని కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.