
గ్రామానికి చేరుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు (వీడియో)
TG: చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. తాండూరు నుంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లు నందిని, సాయిప్రియ, తనూష, ఇవాళ ఉదయం హైదరాబాద్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కొద్దిసేపటి క్రితమే వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం పెర్కంపల్లి మృతదేహాలు చేరుకోగా గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటి వద్ద వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.




