జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌లను జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి శుక్రవారం రాజమండ్రిలోని ఎఫ్‌సీఐ గోడౌన్ ఆవరణలో తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆర్డీఓ ఆర్. కృష్ణ నాయక్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.