ఆంగన్‌వాడీ, ఆశా వర్కర్ల బలోపేతానికి కీలక చర్యలు

3చూసినవారు
ఆంగన్‌వాడీ, ఆశా వర్కర్ల బలోపేతానికి కీలక చర్యలు
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి శనివారం మాట్లాడుతూ, గ్రామీణ ఆరోగ్య, పోషణ వ్యవస్థకు వెన్నెముకలైన ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సదుపాయాల కల్పన, వ్యాధుల ప్రారంభ దశ గుర్తింపు, పోషకాహార అవగాహన, పారదర్శక ప్రోత్సాహక వ్యవస్థలపై తాను లోక్‌సభలో ప్రస్తావించిన అంశాలకు కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సమగ్ర సమాధానం ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. ఈ ఏడాది మార్చి 13న లోక్‌సభలో రూల్-377 కింద ప్రస్తావించిన అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించి, వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పలు కీలక చర్యలు చేపట్టడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.