మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ బ్లడ్ డ్రైవ్ 54వ రోజుకు చేరుకుంది. వేసవిలో ఏర్పడే రక్త కొరతను తగ్గించి, ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలుగా మారాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.