
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు (వీడియో)
TG: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పొందుర్తి శివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. బోధన్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.




