రాజమండ్రి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పర్యటన తర్వాత కదలిక

6చూసినవారు
రాజమండ్రిలో పెరుగుతున్న కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి సమీక్ష నిర్వహించిన తర్వాత ఒక ముందడుగు పడిందని సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి శనివారం కలెక్టరేట్ వద్ద తెలిపారు. ఏపీ పేపర్ మిల్లు, నగర, గ్రామీణ, పారిశ్రామిక కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రి మురుగునీటిని శుద్ధి చేసి, ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన లంకల్లోకి వదిలేందుకు ప్రత్యేక కాలువ నిర్మాణం అవసరమని, దీనికోసం రూ.440 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్