క్షయవ్యాధి నిర్మూలనలో మందులతో పాటు పౌష్టికాహారం కీలకమని, బాధితుల ఆరోగ్య పునరుద్ధరణకు అందరూ చేయూతనివ్వాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజమండ్రిలో 10 మంది క్షయవ్యాధి బాధితులకు పౌష్టికాహార కిట్లను అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ నిర్మూలనకు కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు.