దేవి చౌక్‌లో పాత స్టాంప్ పేపర్ల దందా!

0చూసినవారు
దేవి చౌక్‌లో పాత స్టాంప్ పేపర్ల దందా!
రాజమండ్రి దేవి చౌక్ సమీపంలో పాత నోటరీ స్టాంప్ పేపర్ల అనధికార విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ ఒప్పందాలు, అక్రమ అఫిడవిట్ల కోసం వీటిని దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విలువైన భూములకు సంబంధించిన వివాదాల్లో వీటి వాడకం ప్రమాదకరమని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఈ అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్