మే 7న నేలటూరలో వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్

1చూసినవారు
మే 7న నేలటూరలో వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్
తూర్పు గోదావరి జిల్లాలో "ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు" కార్యక్రమానికి చాగల్లు మండలంలోని నేలటూరు గ్రామంలో మే 7వ తేదీన శ్రీకారం చుట్టనున్నట్లు జేసీ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల నుండి రెవెన్యూ, సర్వే సంబంధిత అర్జీలను స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా అధికారులను సంప్రదించే అవకాశం లభిస్తుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్