బక్రీద్ సెలవు నేపథ్యంలో ఓపెన్ స్కూల్ పరీక్షలు వాయిదా

50చూసినవారు
బక్రీద్ సెలవు నేపథ్యంలో ఓపెన్ స్కూల్ పరీక్షలు వాయిదా
రాష్ట్ర ప్రభుత్వ బక్రీద్ ప్రభుత్వ సెలవు ప్రకటన నేపథ్యంలో, ఈనెల 28వ తేదీన జరగాల్సిన ఓపెన్ స్కూల్ SSC & ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు వాయిదా పడ్డాయని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు మంగళవారం తెలిపారు. వాయిదా పడిన ఈ పరీక్షలను జూన్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 2న పదవ తరగతి గణితము, భారతీయ సంస్కృతి & వారసత్వం పరీక్షలు, అలాగే ఇంటర్మీడియట్ రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం & సామాజిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్