తూర్పుగోదావరిలో కనిపించకుండా పోయిన పెయింటర్.. కుటుంబ సభ్యుల ఆందోళన

441చూసినవారు
తూర్పుగోదావరిలో కనిపించకుండా పోయిన పెయింటర్.. కుటుంబ సభ్యుల ఆందోళన
తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన 40 ఏళ్ల పెయింటర్ సాదే రాజశేఖర్ (జినేల్) గత కొన్ని నెలలుగా కనిపించకుండా పోయారు. ఉపాధి నిమిత్తం విశాఖపట్నం వెళ్లిన ఆయన అక్కడి నుంచి ఇంటితో సంబంధాలు తెంచుకున్నారు. ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు మంగళవారం మండపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 9963913999 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్