
ఇరాన్ క్షిపణిని అడ్డుకోలేకపోయిన 10 రాకెట్లు వీడియో వైరల్
అమెరికా-ఇజ్రాయిల్ దళాల దాడికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన ఒక క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 10 ఇంటర్సెప్టార్ రాకెట్లు ప్రయత్నించినా విఫలమయ్యాయి. ఆ క్షిపణి తన లక్ష్యాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది జెరుసలేంలో తీసిన వీడియో అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ క్షిపణి ఇరాన్‌కు చెందిన ఫతాహ్ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కావచ్చని అంచనా వేస్తున్నారు.




