రాజమండ్రిలోని 49వ డివిజన్‌లో మంగళవారం
కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది.
కాంగ్రెస్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన వార్డు కమిటీని ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా పెదబాబు, ఉపాధ్యక్షుడిగా నవీన్ దావీదు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.