ప్రకృతి వ్యవసాయానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు

8చూసినవారు
ప్రకృతి వ్యవసాయానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు
ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ప్రతిష్టాత్మక అంతర్జాతీయ “ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026” పురస్కారాన్ని అందుకోవడం పట్ల జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ బి. తాతారావు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమానికి మరోసారి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమన్నారు. ఈ అవార్డు దేశానికీ విశేష గౌరవాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఈ అంతర్జాతీయ పురస్కారం ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you