అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై సంయుక్తంగా దాడి చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో, సోమవారం రాజమండ్రిలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ మాట్లాడుతూ, ఇరాన్ ప్రజలతో పాటు ఆ దేశ సుప్రీం ఖమేనీ భవనంపై దాడి చేసి, హత్యలు చేయడం, పాఠశాలలపై బాంబులు వేసి పిల్లలను చంపడం సామ్రాజ్యవాద దురహంకారానికి పరాకాష్ట అని అన్నారు.