18వ లోక్‌సభలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రత్యేక గుర్తింపు పొందారు. సభలో 89శాతం హాజరుతో చురుగ్గా పాల్గొని 16 ముఖ్య చర్చల్లో పాల్గొన్నారు. మొత్తం 119 ప్రశ్నల ద్వారా కొబ్బరి, పొగాకు రైతుల సమస్యలు, రైల్వేలు, మహిళా సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి అంశాలను పార్లమెంట్ దృష్టికి తీసుకురాగలిగారు. స్థానిక సమస్యల పరిష్కారంలో కృషి చేయడమే కాక, అంతర్జాతీయ వేదికలపై దేశ గౌరవాన్ని ప్రతిఫలింపజేస్తూ ప్రశంసలు పొందుతున్నారు.