రాజమండ్రిలోని తూ. గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు గురువారం సాయంత్రం ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం. మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి బి. పద్మ ఆధ్వర్యంలో ప్యానల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతిని సమీక్షించారు. కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.