రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరంలోని కీలక జంక్షన్లు, బీటీ రోడ్ల అభివృద్ధికి రూ. 11 కోట్ల రూపాయలతో ఈ నెలాఖరులోపు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. మంగళవారం కంబాల చెరువు వద్ద ‘పాట్‌హోల్ ఫ్రీ సిటీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లలో 507 పాట్‌హోల్స్‌లో 79ను ఇప్పటికే పూడ్చివేసినట్లు, మిగతావి దశలవారీగా పూర్తి చేస్తామని వెల్లడించారు.