రాజమహేంద్రవరం కాతేరు ఫోర్ట్ బ్రిడ్జి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా వచ్చిన ఐషర్ వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.