రాజమండ్రి: దుబాయ్ లో మహిళ అవస్థలు.. క్షేమంగా స్వస్థలానికి

1135చూసినవారు
రాజమండ్రి: దుబాయ్ లో మహిళ అవస్థలు.. క్షేమంగా స్వస్థలానికి
నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి ఎనిమిది నెలలపాటు దుబాయ్‌లో తీవ్ర ఇబ్బందులు పడిన జిల్లాకు చెందిన షేక్ నాగూర్ బీబీ, రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారుల చొరవతో క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఉపాధి నిమిత్తం మార్చిలో దుబాయ్ వెళ్లిన ఆమె, అక్కడ పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. కుటుంబ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో, అధికారులు ప్రభుత్వానికి, అంబాసిడర్‌కు సమాచారం అందించారు. దీంతో నాగూర్ బీబీ గత నెల 29న స్వగ్రామానికి చేరుకున్నారు. గురువారం కుటుంబంతో కలెక్టరేట్‌కు వచ్చి, తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్