రాజమండ్రిలో 'రాజు వెడ్స్‌ రాంబాయి' చిత్రబృందం సందడి

1068చూసినవారు
రాజమండ్రిలో 'రాజు వెడ్స్‌ రాంబాయి' చిత్రబృందం సందడి చేసింది. సినిమా విజయవంతమైన నేపథ్యంలో హీరో అఖిల్, హీరోయిన్‌ తేజస్విని, నిర్మాత రాహుల్, నటుడు చైతు జొన్నలగడ్డ శనివారం సాయంత్రం నగరంలోని ఊర్వశి థియేటర్‌కు వచ్చి ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే హీరో, హీరోయిన్లు వేదికపై డ్యాన్స్‌లు వేసి అభిమానులను ఉత్సాహపరిచారు.

ట్యాగ్స్ :