రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద గోదావరి పుష్కరాలు – 2027 ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన శనివారం విస్తృత సమీక్ష సమావేశం జరిగింది. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన అన్ని శాఖల నుంచి పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సమగ్ర సమీక్ష జరిపారు. ఈ సమావేశం రాబోయే పుష్కరాలకు ఒక శుభారంభమని పేర్కొన్నారు.