రాజమండ్రిలోని GGH వద్ద రూ. 60 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న వన్ స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను తీర్చడానికే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.