RJY: నవంబర్ 3న యథాతధంగా PGRS కార్యక్రమం

2చూసినవారు
RJY: నవంబర్ 3న యథాతధంగా PGRS కార్యక్రమం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'ప్రజా గ్రీవెన్స్ రిడ్రెస్ సెల్' (PGRS)ను నవంబర్ 3వ తేదీన యధాతధంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు జిల్లా కలెక్టరేట్ కు రావాల్సిన అవసరం లేకుండా, తమ డివిజన్ మండల కేంద్రాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు అందజేసి సమస్యల పరిష్కారం పొందాలని సూచించారు. అలాగే, 1100 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయడం ద్వారా లేదా meekosam. ap. gov. in వెబ్సైట్ లో తమ సమస్యలను తెలియజేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్