రాజ్యాంగ నిర్మాత బి. ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమానత్వం, న్యాయం, హక్కుల కోసం అంబేద్కర్ చూపిన మార్గం నేటికీ ప్రతీ భారతీయుడికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.